చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో పశువులకు లంపీ స్కిన్ డిసీజ్ సోకింది. జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం సరిహద్దులోని కడప జిల్లాలోనూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. కరోనా వ్యాధిలాగే లంపీ స్కిన్ డిసీజ్ పశువులకు అంటువ్యాధిగా మారుతోంది. వ్యాధి సోకిన పశువులను దూర దూరంగా ఉంచడంతో పాటు, వాటికి మేత, నీరు అందించే సమయంలో సామాజిక దూరం పాటించి ఒక పశువు నుంచి మరో పశువుకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యులు కోరుతున్నారు.
తంబళ్లపల్లె మండలంలో గుండ్లపల్లి, మరిమాకుల పల్లి, గంగిరెడ్డిపల్లె, గోపి దిన్నె, కొట్టాల, రేణు మాకులపల్లి గ్రామాల్లో ఈ వ్యాధి కనిపిస్తోంది. వ్యాధి సోకిన పశువులకు సకాలంలో వైద్యం అందించాలని పశువైద్యాధికారి సుజన శ్రీ తెలిపారు.