ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తుంగభద్ర పుష్కరాలకు అనుమతులు ఇవ్వాలి' - తిరుపతి తాజా వార్తలు

కరోనా సాకుతో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించకపోవడం తగదని లలితా పీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. పాఠశాలలు తెరవడానికి, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవడానికి అడ్డురాని కొవిడ్​... పుష్కరాలకే అడ్డుతగులుతుందా అని ఆయన ప్రశ్నించారు.

Lalita Peetham Chairperson Swaroopananda Swamy
తుంగభద్ర పుష్కరాలకు అనుమతులు ఇవ్వాలి

By

Published : Nov 17, 2020, 4:49 PM IST

కొవిడ్​ పేరుతో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించకపోవడం సరికాదని లలితా పీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని పుష్కర స్నానాలు ఆచరించేందుకు ప్రజలను అనుమతించాలని కోరారు. తిరుపతిలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ సమావేశాలు నిర్వహణకు అడ్డురాని కరోనా... పుష్కరాలకే అడ్డుతగులుతుందా అని స్వరూపానంద ప్రశ్నించారు.

తుంగభద్ర పుష్కరాలకు ప్రజలను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. పుష్కరాలను ఆపితే హిందువులు ఉద్యమించడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. 12 ఏళ్ళకోసారి వచ్చే పుష్కరాలను నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details