లోకాయుక్త చైర్మన్ జస్టిస్ లక్ష్మణరెడ్డి తన స్వగ్రామంలో పర్యటించారు. లోకాయుక్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చిత్తూరు జిల్లా తంబళ్లపలెం నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయనిపల్లికి వచ్చారు. ప్రజలు, మండల అధికారులు, పోలీసులు, తంబళ్లల్లి కోర్టు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులతో ఆయన సంతోషంగా గడిపారు. అర్హులైన గ్రామీణ ప్రజల వసతుల కోసం నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా సహకరిస్తానని జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు.
స్వగ్రామంలో రాష్ట్ర లోకాయుక్త చైర్మన్ పర్యటన - చెన్నరాయనిపల్లి
లోకాయుక్త చైర్మన్గా నియమితులైన తర్వాత తొలిసారి జస్టిస్ లక్ష్మణరెడ్డి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయనిపల్లికి వచ్చారు. ఆయనకు గ్రామస్థులంతా ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర లోకాయుక్త చైర్మన్గా..మొదటిసారి స్వగ్రామం చేరుకున్న లక్ష్మణ రెడ్డి