తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. శ్రీకృష్ణముఖ మండపంలో అమ్మవారిని ఆశీనులు చేసి పూజ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు అర్చనలో పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ సాయంత్రం అంకురార్పణ చేయనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. కుంకుమార్చనలో తితిదే ఈఓ జవహర్ రెడ్డి, జేఈఓ బసంతకుమార్ పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ - laksha kumkumarchana seva news
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా సాగింది.
పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవ