ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమించినవాడు మోసం చేశాడని... - latest news in kaliyambaka

ప్రేమించినవాడే లోకం అనుకుంది... పెళ్లి చేసుకొని జీవితాన్ని పంచుకోవాలని కలలు కనింది. ప్రేమికుడే పెళ్లి చేసుకోవటానికి నిరాకరించటంతో కనిపించకుండాపోయింది. గ్రామమంతా గాలించినా ఫలితం లేదు.. చివరికి ఊరి చెరువులో అచేతనంగా ఉన్న యువతిని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు యువతి మృతదేహంతో ఆందోళనకు దిగారు.

lady suicide
ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

By

Published : Oct 14, 2020, 2:18 PM IST

చిత్తూరు జిల్లా విజయపురం మండలం కళియంబాకం ఆది ఆంధ్రవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమించి మోసపోయానంటూ గ్రామానికి చెందిన ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు ఇంటిముందు.. యువతి మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

ఏం జరిగిందంటే..

గ్రామానికి చెందిన పృథ్వి, ఆ గ్రామంలో ఉంటున్న ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ పృథ్వీకి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. ప్రేమికురాలితో పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని భావించిన ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కుటుంబీకులు గాలించినా ఫలితం లేదు. అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలించగా.. ఆమె మృతదేహం బయటపడింది. యువతి మృతికి ప్రియుడే కారణమని.. మృతదేహంతో పృథ్వి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

భూముల అన్యాక్రాంతం.. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌

ABOUT THE AUTHOR

...view details