చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎస్సీ కాలనీలో మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. తాగునీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన మండలాభివృద్ధి అధికారిణి ఉమావాణి నిరసన కారులతో మాట్లాడి... కాలనీలో నూతనంగా తవ్వించిన బోరుబావిలో మోటారు ఏర్పాటు చేసి వెంటనే సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళల ధర్నా - చిత్తూరు జిల్లా తాగునీటి సమస్యలు
తాగునీటి సమస్య పరిష్కరించాలని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం ఎస్సీ కాలనీలో మహిళలు ధర్నా చేశారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ladies dharna in chittoor dst gangadhar nellore consistency about water problems