ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' ఇకనుంచి భక్తులకు అందుబాటులోకి శ్రీవారి లడ్డు' - తితిదే శ్రీవారి లడ్డు వార్తలు

దాదాపు 50 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డును భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20న శ్రీవారి దర్శనాలను ఆపివేసిన తితిదే తిరుమలలో లడ్డు తయారీతో పాటు విక్రయాలను నిలిపివేసింది. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో తితిదే ఏర్పాట్లు చేసింది.

laddu sales at tirumala
శ్రీవారి లడ్డు

By

Published : May 15, 2020, 8:17 PM IST

50 రోజుల తర్వాత తిరుమల శ్రీవారి లడ్డును భక్తులకు తితిదే అందుబాటులోకి తెచ్చింది. మార్చి 20న శ్రీవారి దర్శనాలను ఆపివేసిన తితిదే తిరుమలలో లడ్డు తయారీతో పాటు విక్రయాలను నిలిపివేసింది. శ్రీవారి కల్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు అందజేసే పెద్ద లడ్డు, వడను ఈరోజు నుంచి తితిదే అందిస్తోంది. స్వామి వారి సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నప్పటికి దిట్టం ప్రకారం స్వామి వారికి సమర్పించే ప్రసాదాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. గతంలో ఈ లడ్డులను ఆర్జితసేవలో పాల్గొనే భక్తులకు అందజేసేవారు. లాక్​డౌన్ నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో ప్రసాదాలను తిరుపతి పరిపాలనా భవనానికి తరలిస్తున్నారు. ప్రత్యేకంగా విక్రయ కేంద్రం ఏర్పాటు చేసి శ్రీవారి పెద్ద లడ్డు, వడలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. స్థానికులకు శ్రీవారి ప్రసాదాలు అందించే లక్ష్యంతో తితిదే ఏర్పాట్లు చేసింది.

ABOUT THE AUTHOR

...view details