చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు , తెలంగాణ సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2019 ఎన్నికలకు ముందే చంద్రమౌళి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబుపై ఆయన పోటీ చేశారు. అనారోగ్యం కారణంగా చంద్రమౌళి తరఫున వైకాపా నేతలే నామినేషన్ దాఖలు చేశారు. సుమారు 30వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు.
కుప్పం నియోజకవర్గ వైకాపా ఇంఛార్జ్ చంద్రమౌళి కన్నుమూత - చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కన్నుమూశారు. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
chandramouli mruthi