చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్స్టేషన్ ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుప్పంలోని అద్దె ఇంట్లో ఆయన ఉరి వేసుకొని చనిపోయినట్టు గుర్తించారు. చిత్తూరుకు చెందిన రాజేంద్ర 7నెలల కిందటే కుప్పంకు బదిలీ అయ్యారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
కుప్పం పోలీస్స్టేషన్ ఏఎస్ఐ ఆత్మహత్య - కుప్పం నేర వార్తలు
చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం నెలకొంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర.. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
కుప్పం పోలీస్స్టేషన్ ఏఎస్ఐ ఆత్మహత్య