ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుప్పంలో.. తెదేపా బ్యానర్లకు నిప్పుపెట్టిన దుండగులు - Chittoor District Latest News

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పరిధిలో తెదేపా బ్యానర్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. చంద్రబాబు ఫొటోలు ఉన్న బ్యానర్లను కాల్చినవారిపై చర్యలు తీసుకోవాలని... తెదేపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆందోళన వ్యక్తం చేశారు.

తెదేపా బ్యానర్లకు నిప్పు
తెదేపా బ్యానర్లకు నిప్పు

By

Published : Mar 25, 2021, 9:58 PM IST

తెదేపా కార్యకర్తల ఆందోళన

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పరిధిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బ్యానర్లకు బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన గురువారం వెలుగుచూసింది. ఆగ్రహించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.

తెదేపా అధినేత చంద్రబాబు ఫొటోలు ఉన్న బ్యానర్లను కాల్చినవారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా బ్యానర్లకు నిప్పుపెటడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details