ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Municipal Elections: కుప్పం 14 వ వార్డు తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ - కుప్పం 14 వ వార్డు తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ వార్తలు

చిత్తూరు జిల్లా కుప్పం 14 వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటేశ్ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. అధికారులు కావాలనే తన నామినేషన్‌ తిరస్కరించినట్లు అభ్యర్థి వాపోయారు.

కుప్పం 14 వ వార్డు తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ
కుప్పం 14 వ వార్డు తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

By

Published : Nov 6, 2021, 9:21 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాం కుప్పం 14 వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కావాలనే తన నామినేషన్‌ తిరస్కరించారని అభ్యర్థి వెంకటేష్‌ ఆరోపిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు తనకు చెప్పినట్లు వెంకటేశ్ వెల్లడించారు. ఉదయం పత్రాలు చూసి సక్రమంగానే ఉన్నాయని చెప్పి..ఇప్పుడు నామినేషన్‌ తిరస్కరించినట్లు వాపోయారు.

కాగా..నిన్న నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లిన వెంకటేశ్​పై వైకాపా కార్యకర్తలు దాడి చేసి, నామపత్రాలు చించేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details