ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకన్న సేవలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి - temple

తిరుమల శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దర్శించుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మంత్రి రేవన్నతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

కుమారస్వామి

By

Published : May 18, 2019, 1:59 PM IST

శ్రీవారి సేవలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి

తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దర్శించుకున్నారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా.. కుటుంబీకులతో కలిసి స్వామివారి సేవకు హాజరయ్యారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారి వెంట కర్ణాటక మంత్రి రేవణ్న ఉన్నారు. ప్రతి పుట్టినరోజున స్వామిని దర్శించుకుంటానని దేవెగౌడ చెప్పారు. స్వామి కృపతోనే ప్రజలకు నిష్పక్షపాత సేవలు అందించానన్నారు. కర్ణాటకలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూటమి 18 సీట్లు గెలుస్తుందని కుమారస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details