ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హంద్రీనీవా కాలువతో ప్రధాన చెరువులన్నింటినీ నింపాలి' - అనంతపురం జిల్లా నుంచి నీరు

తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకూ నీరు చేరడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన చెరువులన్నింటినీ నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Krishna waters flow
'హంద్రీనీవా కాలువతో ప్రధాన చెరువులన్నింటినీ నింపాలి'

By

Published : Nov 12, 2020, 7:02 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని హంద్రీనీవా కాలువలోకి మరోసారి అధికారులు కృష్ణా జలాలు వదిలారు. పెద్దతిప్పసముద్రం మండలం పులికల్లు సమీపంలోని కాలువలోకి, అనంతపురం జిల్లా నుంచి నీరు చేరుతోంది. తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకూ హంద్రీనీవా జలాలు ప్రవహిస్తున్నాయి. దీంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన చెరువులన్నింటినీ జలాలతో నింపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details