ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం - tiruchanuru padmavati temple news

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి మూడురోజుల పాటు అమ్మవారి వసంతోత్సవాలు జరగనున్నాయి.

ttd
కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

By

Published : May 18, 2021, 4:42 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ది చేశారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన చేసి శుద్ధి చేశారు. అనంతరం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు అమ్మవారికి వసంతోత్సవాలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details