ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీర భక్తుడి వాహనంపై ఊరేగిన కోదండరాముడు - కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు తాజా వార్తలు

భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుంతుడి వాహనంపై శ్రీరామచంద్రుడు దర్శనమించారు. తిరుపతి కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వామివారు హనుమంతుడి వాహనంపై ఊరేగారు. అనంతరం స్నపం తిరుమంజనాన్ని కన్నుల పండువగా జరిపించారు.

Kodandaramudi Annual Brahmotsavalu
హనుమంతు వాహనంపై ఊరేగిన కోదండరాముడు

By

Published : Mar 18, 2021, 7:50 PM IST


తిరుపతి కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఆరో రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన హనుంతుడి వాహనంపై విహరించే శ్రీరామచంద్రుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. వైష్ణవ సాంప్రదాయంలో తిరువడిగా కీర్తించే హనుమద్వాహన సేవను దర్శించి భక్తులు తిలకించి తరించారు. వాహనసేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details