తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కల్పవృక్ష వాహనంపై విహరించే శ్రీరామ చంద్రుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. కరోనా కారణంగా ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉత్సవాలలో తితిదే జీయర్ స్వాములు, అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా వసంతోత్సవం..