ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ములకలచెరువు నుంచి కిసాన్ రైలు ప్రయోగాత్మక ప్రారంభం - Kisan Rail news

చిత్తూరు జిల్లా ములకలచెరువు నుంచి కిసాన్ రైలును అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో పెద్దఎత్తున టమాటాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని ప్రణాళికలను అధికారులు రచిస్తున్నారు.

Kisan Rail starts from mulakalacheruvu
ములకలచెరువు నుంచి కిసాన్ రైలు ప్రయోగాత్మక ప్రారంభం

By

Published : Oct 20, 2020, 8:05 PM IST

చిత్తూరు జిల్లా ములకలచెరువు నుంచి టమాటాలను రైలు ద్వారా దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఏర్పాటు చేసిన... కిసాన్ రైలును అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. త్వరలో చిత్తూరు జిల్లా టమాటాలను దేశవ్యాప్తంగా రవాణా చేయాలనే ఆలోచన లో భాగంగా... మంగళవారం రెండు బోగీల్లో నలభై మూడు టన్నుల టమాటాలను ప్రయోగాత్మకంగా దిల్లీకి పంపించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రైల్వే శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రయోగం ద్వారా సాధ్యాసాధ్యాలను పరిశీలించి భవిష్యత్తులో పెద్దఎత్తున టమాటాలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని ప్రణాళికలను అధికారులు రచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details