శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణకిరీటాల దొంగను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 నెలల క్రితం తిరుపతిలో చోరీ జరగ్గా... ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు మహారాష్ట్రకు చెందినవాడిగా గుర్తించారు. నాందేడ్ జిల్లాకు చెందిన నిందితుడు ఆకాష్ ప్రతాప్.. సరోడే నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేల్చారు. చోరీల కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 7 ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసులో వివరాలను సేకరించాయి. పక్కా సమాచారం మేరకు నిందితుడిని దాదర్ రైల్వేస్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గోవిందరాజస్వామి కిరీటాల దొంగలు దొరికారు!
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో స్వర్ణకిరీటాల చోరీ కేసులో పురోగతి కనిపించింది. అపహరణకు పాల్పడిన నిందితుణ్ని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల అదుపులో గోవిదరాజస్వామి స్వర్ణకిరీటాల దొంగ