చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రం... కార్తికేయ నామ స్మరణతో మార్మోగుతోంది. ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విజ్ఞానగిరిపై వెలసిన వల్లి, దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి... నయన మనోహరంగా కల్యాణోత్సవం నిర్వహించారు. నవ వధూవరులైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణవేదికపైకి తీసుకువచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ నడుమ క్రతువు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
శ్రీకాళహస్తిలో కన్నులపండువగా కార్తికేయుని కల్యాణం - temple
ఆషాడ కృత్తిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తిలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వేరస్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు.
కార్తికేయ కల్యాణం