తిరుపతి రూరల్ మండలాలలో ఎస్ఈబీ ఏఈఎస్ సుధీర్ బాబుకు అందిన రహస్య సమాచారం మేరకు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిoచారు. అలిపిరి - చెర్లోపల్లి, తిరుపతి శెట్టిపల్లి మార్గాలలో దాడులు చేశారు. తిరుమలనగర్‌కు చెందిన ముని భాస్కర్ తన ఇన్నోవా కారులో (572) కర్ణాటక మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టకున్నారు. పోలీసులు ఆ మద్యాన్ని, ఇన్నోవా కారును స్వాధీనపరచుకొని కేసు నమోదుచేశారు.
తిరుపతిలో కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురి అరెస్టు - illegal wine news in tirupathi
చిత్తూరు జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఎస్ఈబీ అధికారుల సోదాలలో ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్న మద్యం లభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తాజాగా కర్ణాటక మద్యాన్ని తిరుపతి పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కార్లను, ఒక స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో మార్గంలో మహీంద్ర మాక్స్ వాహనంతో పాటుగా ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులు తిరుపతి రూరల్ మండలం ఎల్ ఎస్ నగర్‌కు చెందిన గౌస్ బాషా , దామినీడుకు చెందిన వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. తిరుపతి ఆటోనగర్‌కు చెందిన టి. నాగమోహన్ పారిపోయాడు. అతనిపై కేసు నమోదుచేశారు. రెండు కేసులలో భారీగా కర్ణాటక మద్యంతో పాటుగా ముగ్గురుని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కార్లను, ఒక స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఈబీ అధికారి సుధీర్ బాబు తెలిపారు.
ఇవీ చదవండి