చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అంబోధర పల్లె క్రాస్ వద్ద ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. కర్ణాటక నుంచి కారు తరలిస్తున్న 800 క్వార్టర్ బాటిళ్లు, 50 ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దీని విలువ సుమారు రూ. 75 వేలు ఉంటుందని సుమన్ పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించబోమని ఎస్సై హెచ్చరించారు.
అంబోధర పల్లె వద్ద కర్ణాటక మద్యం పట్టివేత - చిత్తూరులో మద్యం పట్టివేత
చిత్తూరు జిల్లా అంబోధర పల్లె వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో కర్ణాటక మద్యం పట్టిపడింది. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమన్ హెచ్చరించారు.
అంబోధర పల్లె వద్ద కర్ణాటక మద్యం పట్టివేత