చిత్తూరు నగర శివారులోని ముత్తిరేవులలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం బాటిళ్లను.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.2.28 లక్షల విలువైన 3264 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఈ కేసులో మధుసూదన్ రెడ్డి అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేసి.. దాము అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో సంబంధంలేని తమ సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. దాము తమ్ముడు సతీష్ చిత్తూరులోని ఎక్సైజ్ రూరల్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. దామును విడిచి పెట్టారు. నిందితుడు మధుసూధన్ రెడ్డిని రిమాండ్కు తరలించారు.
చిత్తూరులో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్ట్ - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
చిత్తూరు జిల్లా ముత్తిరేవులలోని ఓ ఇంట్లో.. అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
చిత్తూరులో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్ట్