కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను.. చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు-తిరుపతి రహదారిలోని డి.వెంగనపల్లి క్రాస్ వద్ద.. వారి నుంచి 1,104 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.75 లక్షల విలువ ఉంటుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
కారులో తరలిస్తున్న 1,104 బాటిళ్ల కర్ణాటక మద్యం పట్టివేత - చిత్తూరు పోలీసుల అదుపులో 1104 బాటిళ్ల కర్ణాటక మద్యం
దాదాపు 1.75 లక్షల విలువైన కర్ణాటక మద్యం అక్రమ రవాణాను.. చిత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. బెంగళూరు-తిరుపతి రహదారిలోని డి.వెంగనపల్లి క్రాస్ వద్ద కారులో తరలిస్తున్న.. 1,104 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న చిత్తూరు పోలీసులు
ఈరోజు తెల్లవారుజామున డి.వెంగనపల్లి క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. కర్నాటక నుంచి తరలిస్తున్న మద్యం దొరికింది. అక్రమ రవాణాకు పాల్పడిన టి.రాజా, రెడ్డి ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్‌ఈసీ