రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో.. భాజపా మరోసారి చేతులెత్తేసింది. ఆ విషయం ముగిసిన అధ్యాయమంటూ.. సాక్షాత్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. ఈ నెల 9న ప్రధాని మోదీ.. తిరుపతి పర్యనకు రానున్న నేపథ్యంలో.. పర్యటన ఏర్పాట్లను వివరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఎంతో చేసిందని.. అవకాశం ఉంటే కేంద్రం ఈ పాటికే హోదా ఇచ్చేదని చెప్పారు. హోదాపై ఇక ఎవరు ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండబోదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా - special status
ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటిసారి మోదీ ఈ నెల 9న తిరుపతికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
![ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3499710-582-3499710-1559921025315.jpg)
కన్నా లక్ష్మీనారాయణ
కన్నా లక్ష్మీనారాయణ
ఇక.. ''9న సాయంత్రం 4.30గంటలకు తిరుపతి చేరుకోనున్న మోదీ.. సాయంత్రం 5.10 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల పద్మావతి వసతిగృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారరు. సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు శ్రీవారి సేవలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 8గంటలకు తిరిగి దిల్లీకి పయనమవుతారు'' అని కన్నా వివరించారు.