కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో నేడు వినాయక స్వామి మూల విరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. తిరిగి ఆగస్టులో పునః దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాణిపాకంలో వినాయక స్వామి గర్భాలయం పునర్నిర్మాణ పనులు చేపట్టటంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటివరకు కాణిపాకం ప్రధానాలయం పక్కనే ఉన్న చిన్న బాల ఆలయంలోని అత్తి చెట్టు వద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉదయం కాల అర్చన, మూర్తి హోమం, పూర్ణాహుతి, తత్వ అర్చన మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించి.. బాల విఘ్నేశ్వర విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.. మూలవిరాట్ దర్శనం నిలిపివేత - kanipakam temple news
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి మూలవిరాట్ దర్శనాన్ని అధికారులు నిలిపివేశారు. గర్భాలయం పునర్నిర్మాణ పనులు చేపట్టటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కాణిపాక వినాయక స్వామి