ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తూరు జిల్లా పోలీసులతో కనిగిరి ఎమ్మెల్యే వాగ్వాదం

చిత్తూరు జిల్లా ఆంధ్రా - కర్ణాటక సరిహద్దులో పోలీసులతో కనిగిరి ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. బెంగళూరు నుంచి 36 మందిని ఆంధ్రా సరిహద్దుకు ఎమ్మెల్యే తీసుకురాగా చీకలబైలు చెక్‌పోస్టు వద్ద 5 వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

By

Published : Apr 15, 2020, 3:33 PM IST

Published : Apr 15, 2020, 3:33 PM IST

Updated : Apr 15, 2020, 6:17 PM IST

kanigiri mla halchal
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో పోలీసులతో కనిగిరి ఎమ్మెల్యే వాగ్వాదం

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన యాదవ్ చిత్తూరు జిల్లా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బెంగళూరు నుంచి 36మంది తన అనుచరులను ఎమ్మెల్యే ఆంధ్రా సరిహద్దుకు తీసుకువచ్చారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఐదు వాహనాలు చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని చీకలబైలు చెక్ పోస్టు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. లాక్ డౌన్ దృష్ట్యా రాష్ట్ర సరిహద్దులు దాటి జిల్లాలోకి ప్రవేశించేందుకు అనుమతించేదిలేదని తేల్చి చెప్పారు. దీంచో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని..తాను చెప్తే వినరా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనల మేరకు సరిహద్దు దాటి అనుమతించలేమని...దీనిపై ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతోనే అడ్డుకుంటున్నామని వివరించారు. ఈ అంశాన్ని మదనపల్లి డీఎస్పీకి తెలియజెప్పటంతో ఆయన వచ్చి ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. అనంతరం ఆయన అనుచరులను తిరిగి కర్ణాటక వైపు పంపారు.

Last Updated : Apr 15, 2020, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details