ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుచానూరులో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం కన్నుల పండుగగా సాగింది. కరోనాతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొలగాలని తితిదే ఈ మహాయాగం నిర్వహిస్తోంది.

తిరుచానూరు
తిరుచానూరు

By

Published : Jul 18, 2021, 8:33 PM IST

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఆల‌యంలో క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగం కన్నులపండగగా సాగింది. కరోనాతో ప్రపంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని ప్రార్థిస్తూ శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారికి తితిదే మ‌హాయాగం నిర్వహిస్తోంది. క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగంలో భాగంగా మూడ‌వ రోజు శాస్త్రోక్తంగా జ‌ప‌ త‌ర్పణ‌ హోమాలు నిర్వహించారు.

ఉద‌యం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఆల‌యంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండ‌పంలో అమ్మవారిని వేంచేపు చేసి 210 మంది ఋత్వికులు.. చ‌తుష్టార్చన‌, కోటి కుంకుమార్చన‌లో ఒక ఆవ‌ర్తి, హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వహించారు. 120 మంది ఋత్వికులు కోటి మల్లె పుష్పార్చన‌, 36 మంది హోమం, 12 మంది శ్రీ భాష్యం, రామాయ‌ణం, భాగ‌వ‌తం, మ‌హాభార‌తం పారాయ‌ణం నిర్వహించారు. మరో 12 మంది ఋత్వికుల చోప్పున జ‌పం, ఆవు పాల‌తో త‌ర్పణం నిర్వహించారు.

ఇదీ చదవండి

PUVVAD AJAY KUMAR: తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో తెలంగాణ మంత్రి

ABOUT THE AUTHOR

...view details