వరస వర్షాల ప్రభావంతో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కళ్యాణి జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఈ ప్రాజెక్టు ఐదేళ్ల తరువాత పూర్తిస్థాయిలో నిండింది. రాత్రి డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే జలాశయ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో ప్రాజెక్టును చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు నిరాశతో వెనుదిరిగారు.
ఇదీ చదవండి
కళ్యాణి డ్యాంకు జలకళ.. పర్యటకులకు అనుమతి నిరాకరణ - కళ్యాణి డ్యాం సందర్శనకు అనుమతి నిరాకరణ
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లాలోని కళ్యాణి డ్యాంకు జలకళ సంతరించుకుంది. జలాశయాన్ని సందర్శించేందుకు పర్యటకులకు అనుమతి నిరాకరించారు అధికారులు.
కళ్యాణి డ్యాంకు జలకళ..పర్యాటకులకు అనుమతి నిరాకరణ