చిత్తూరు జిల్లా కలికిరి పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న దామోదరం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు దామోదరం లంచం డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అనిశా అధికారులు.. ఏఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బెయిల్ కోసం లంచం..ఏసీబీకి చిక్కిన ఏఎస్సై - ఏసీబీకి చిక్కిన కలికిరి ఏఎస్సై
బెయిల్ ఇవ్వటం కోసం లంచం డిమాండ్ చేశాడో ఏఎస్సై. ఇది తెలిసిన ఏసీబీ అధికారులు మాటు వేసి.. లంచం తీసుకుంటున్న అధికారిని పట్టుకున్నారు.
ఏసీబీకి చిక్కిన ఏఎస్సై