చిత్తూరు జిల్లా రొంపిచర్లలో నిర్వహించిన... కళాంజలి ఫ్యాషన్ షో చూపరులను ఆకట్టుకుంది. స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా... కళాంజలి తమ వెరైటీ డిజైన్లను ప్రదర్శించింది. చిన్నారులు రంగురంగుల వస్త్రాలు ధరించి అదరహో అనిపించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూనే... పాశ్చాత్య తీరుకు అనుగుణంగా విద్యార్థులు ధరించిన వస్త్రాలు ఆకట్టుకున్నాయి.
అలరించిన చిన్నారుల ఫ్యాషన్ షో - చిత్తూరు జిల్లాలోని కళాంజలి ఫ్యాషన్ షో
చిత్తూరు జిల్లా రొంపిచర్లలోని ఆకాష్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చిన్నారులు ఫ్యాషన్ షోతో అలరించారు. బుడిబుడి అడుగులతో ఆకట్టుకున్నారు. అధునూతన వస్త్రాలు ధరించి... స్టేజీపై వయ్యారపు నడక నడిచారు.
అలరించిన చిన్నారుల ఫ్యాషన్ షో..