శ్రీకాళహస్తీశ్వరాలయంలో కైలాసగిరి ప్రదక్షిణ మహోత్సవం - kailasagiri pradakshina at sriklahasti temple
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కైలాసగిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి, అమ్మవారికి కైలాసగిరి ప్రదక్షిణ మహోత్సవం చేపట్టారు. కైలాసగిరిలోని దేవతా సమూహాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అతిథులుగా వస్తారనేది భక్తుల నమ్మకం. ఆది దంపతుల కల్యాణం ముగియగానే వాళ్లందరికీ శ్రీ సోమస్కంధ మూర్తి సమేత శ్రీ జ్ఞానప్రసూనాంభీకాదేవి అంబారులపై కొలువుదీరి వీడ్కోలు పలకడం ఈ విశేష ఉత్సవ పరమార్థం. 23 కిలోమీటర్ల మేర సాగే కైలాసగిరి ప్రదక్షిణలో... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.