చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలంలోని ఝరికోన ప్రాజెక్టు వద్ద... చిత్తూరు - కడప జిల్లాల మత్స్యకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీటి వినియోగానికి తప్ప.. చిత్తూరు జిల్లా మత్స్య కారులకు చేపల వేటకు అనుమతి లేదని కడప జిల్లా మత్స్యకారులు అడ్డగించగా... ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినందున తాము.. చేపలు పట్టుకుంటామని చిత్తూరు జిల్లా మత్స్యకారుల వాదనకి దిగారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న ఇరు జిల్లాల రెవెన్యూ, పోలీస్ అధికారులు..ఇరువర్గాల మత్స్యకారులకు సర్దిచెప్పారు.
ఝరికోన ప్రాజెక్టు వద్ద మత్స్యకారుల వాగ్వాదం - చిత్తూరు జిల్లా నేటి వార్తలు
చిత్తూరు జిల్లాలోని ఝరికోన ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చేపల వేట విషయంలో చిత్తూరు - కడప జిల్లాల మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. మత్స్యకారులకు సర్దిచెప్పారు.
![ఝరికోన ప్రాజెక్టు వద్ద మత్స్యకారుల వాగ్వాదం kadapa- chitthore district Fishermen Fight at Jharikona project in chitthore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7682854-1008-7682854-1592559742843.jpg)
ఝరికోన ప్రాజెక్టు వద్ద మత్స్యాకారుల వాగ్వాదం