కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి తితిదే ఈవో పట్టువస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏడాది వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కల్యాణం సమయంలో తిరుమల శ్రీవారి తరపున వస్త్రాలను బహూకరిస్తారు. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఊరేగింపుగా వెళ్లి కాణిపాకం ఆలయ అధికారులకు వస్త్రాలను అందజేశారు. తితిదే అధికారులకు స్వామివారి దర్శనం కల్పించి... తీర్థప్రసాదాలను అందజేశారు.
కాణిపాకం వినాయకుడికి తిరుమల శ్రీవారి తరఫున పట్టువస్త్రాలు - కాణిపాకం వినాయక బ్రహ్మోత్సవాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి తితిదే ఈవో పట్టువస్త్రాలను సమర్పించారు. ఏటా స్వామివారి కల్యాణం సమయంలో తిరుమల శ్రీవారి తరఫున వినాయకునికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాల సమర్పణ