నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ అతిథిగృహం నుంచి పట్టువస్త్రాలతో ఆలయానికి విచ్చేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. స్వామివారికి వస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కడం ఆనందంగా ఉందన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నవరత్నాలను దశలవారీగా ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు - నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
సోమవారం నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు