తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడీ) జూన్ నెల కోటాను తితిదే ఆన్లైన్లో విడుదల చేసింది. జూన్‌లో 21వ తేదీని మినహాయించి మిగిలిన రోజులకు... రోజుకు మూడ వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల ఆన్లైన్ టికెట్లను భక్తులు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టికెట్‌తో పాటు వసతి గదులు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి తిరుపతిలో రోజుకు మూడువేల చొప్పున సర్వదర్శనం(ఎస్ఎస్డీ) టికెట్లను తితిదే కౌంటర్లలో భక్తులకు అందిస్తారు. భక్తులు ఒకరోజు ముందుగా టికెట్లు తీసుకొని మరుసటి రోజు దర్శనానికి వెళ్లాలి.
ప్రత్యేక దర్శనం ఆన్లైన్ కోటా విడుదల - ttd latest news
శ్రీవారి దర్శనంకు సంబంధించి ప్రత్యేక దర్శనం జూన్ నెల కోటాను తితిదే విడుదల చేసింది. దర్శనంతో పాటు గదులు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
![ప్రత్యేక దర్శనం ఆన్లైన్ కోటా విడుదల special entry darshan online tickets released by ttd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7537638-427-7537638-1591675842850.jpg)
జూన్ నెల ఆన్లైన్ కోటా విడుదల