ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్జి రామకృష్ణ కుమారుడు లేఖ - high court chief judge

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పోలీస్ ఉన్నతాధికారులకు జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ లేఖ రాశారు. చిత్తూరు కారాగారంలో తన తండ్రికి ప్రాణహాని ఉందని ఆరోపించారు.

judge ramakrishna son wrote a letter to high court chief judge
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్జి రామకృష్ణ కుమారుడు లేఖ

By

Published : May 31, 2021, 4:07 PM IST

చిత్తూరు జిల్లా కారాగారంలో జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ... ఆయన కుమారుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పోలీస్ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈరోజు ఉదయం సహచర ఖైదీ వద్ద కత్తి దొరికిందని తన తండ్రి జడ్జి రామకృష్ణ చెప్పినట్లు వంశీకృష్ణ లేఖలో పేర్కొన్నారు. గతనెల 15న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజద్రోహం కేసు లో జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తన తండ్రికి ప్రాణహాని ఉన్నందున వేరే జైలుకు తరలించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details