ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Judge rama krishna: పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్టయ్యారు.

judge rama krishna released from chittor district pileru sub jail
పీలేరు సబ్ జైలు నుంచి విడుదలైన జడ్జి రామకృష్ణ

By

Published : Jun 17, 2021, 2:46 PM IST

Updated : Jun 17, 2021, 7:14 PM IST

పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదల

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. రూ.50 వేల రూపాయల సొంత పూచీకత్తుపై.. బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఈనెల 15న తీర్పు ఇచ్చింది. ఉత్తర్వులు అందుకున్న పీలేరు సబ్ జైలు అధికారులు.. ఈరోజు జడ్జి రామకృష్ణను విడుదల చేశారు. జైలు బయట దళిత సంఘాల నాయకులు జడ్జి రామకృష్ణకు స్వాగతం పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ.. హైకోర్టు స్పష్టమైన షరతులు విధించిన నేపథ్యంలో.. జడ్జి రామకృష్ణ ఆయన కుమారుడు వంశీకృష్ణతో కలిసి సొంత గ్రామమైన బి.కొత్తకోటకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణ అరెస్టయ్యారు.

Last Updated : Jun 17, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details