చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వలస కూలీలకు ఏర్పాటు చేసిన భోజన వసతి సౌకర్యాలను జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి పరిశీలించారు. వలస కూలీల ఆకలి బాధ నివారణ కోసం ప్రభుత్వం భోజనం, వసతి ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. అనుమతులు వచ్చినవెంటనే వారిని స్వస్థలాలకు పంపుతామని జిల్లా కలెక్టర్ భరత్ గుప్త తెలిపారు. నియోజకవర్గంలోని శంకంపల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద వలస కూలీలకు ఏర్పాటు చేసిన భోజన వసతుల జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
వలస కూలీలకు వసతి, భోజన ఏర్పాట్ల పరిశీలన - District Collector Bharat Gupta
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన భోజన, వసతి సౌకర్యాలను జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి పరిశీలించారు. దేశ నలుమూలల నుంచి కాలినడకన వెళ్లే వారి కోసమే ప్రత్యేకంగా ఏర్ఫాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఉత్తరాది నుంచి దక్షిణాది వైపునకు, దక్షిణాది నుంచి ఉత్తరాది వైపునకు కాలి నడకనవెళ్లే వలస కూలీలకు ఆకలి బాధ నివారణ కోసం సంజీవరాయపల్లి, ఆంజనేయస్వామి గుడి వద్ద మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో పది రోజుల పాటు భోజనం అందిస్తున్నట్లు పాకాల ఎంపీడీఓ అమర్నాథ్ చెప్పారు. భోజనం వసతులు కల్పించడంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంపీడీఓ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండితిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా భార్గవి