ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు

తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో జాతిరత్నాలు చిత్ర నటులు దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని హీరో నవీన్ పోలిశెట్టి తెలిపారు.

jathi ratnalu movie team visits tirumala
శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు

By

Published : Mar 18, 2021, 8:34 AM IST

శ్రీవారి సేవలో జాతిరత్నాలు చిత్ర నటులు

తిరుమల శ్రీవారిని జాతిరత్నాలు చిత్ర నటులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కథానాయకుడు నవీన్ పోలిశెట్టి , హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందుకున్నారు. చిత్రానికి లభిస్తున్న ప్రేక్షకాదరణపై వారు సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details