పుంగనూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ - janatha curfew news in punganeure
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశారు.
జనతా కర్ఫ్యూ సందర్భంగా కార్మికులతో కలిసి పనిచేసిన ఎంపీ రెడ్డప్ప
పుంగనూరు నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా కార్మికులు వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నగరపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప దగ్గరుండి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనిచేశారు. ఉదయం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.