జనతా కర్ఫ్యూతో బోసిపోయిన చిత్తూరులోని ప్రధాన కూడళ్లు
జనతా కర్ఫ్యూను చిత్తూరు ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. ఉదయం 6 గంటలకే అన్ని దుకాణాలు మూసివేశారు. వాహనాలు రోడ్లపై కనిపించకపోవటంతో నగరం అంతా బోసిపోయింది.
జనతా కర్ఫ్యూతో బోసిపోయిన చిత్తూరులోని ప్రధాన కూడళ్లు
చిత్తూరు నగరంలోని ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించారు. ఉదయం 6 గంటలకే నగరంలోని వాణిజ్య దుకాణాలు, సముదాయాలు, సినిమా థియేటర్లు, చికెన్, మటన్ సెంటర్లు మూతబడ్డాయి. బస్సులు, ఆటోలు రోడ్లపై కనిపించకపోవడంతో నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే గాంధీ విగ్రహా కూడలి బోసిపోయింది. జనం ఇళ్లకే పరమితమైపోయారు.