ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనం నమ్మకమే నా బలం'

జనసేనను చట్టసభల్లోకి పంపాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. చిత్తూరులో రోడ్ షో చేసిన పవన్.. దమ్ము, ధైర్యం లేనివారంతా రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని అన్నారు.

చిత్తూరులో జనసేన అధ్యక్షుడు పవన్ రోడ్ షో

By

Published : Mar 2, 2019, 10:21 PM IST

చిత్తూరులో జనసేన అధ్యక్షుడు పవన్ రోడ్ షో
జనసేనను చట్టసభల్లోకి పంపాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. చిత్తూరు నగరం గాంధీ కూడలిలో రోడ్ షో చేసిన పవన్.. దమ్ము, ధైర్యం లేనివారంతా రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని అన్నారు. మిగతా పార్టీల్లా తాను అమలుకు నోచుకోలేని హామీలు ఇవ్వనని చెప్పారు. అవకాశం ఇస్తే.. ఏ ముఖ్యమంత్రీ సాధించలేని అభివృద్ధిని నేను చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. భాజపా నాయకులు తన దేశభక్తిని శంకించినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. తెదేపాతో అవగాహన కుదుర్చుకున్నానంటూ వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details