వైకాపా ప్రభుత్వ నిరంకుశ పరిపాలన ప్రశ్నించడానికి భాజాపా, జనసేన కలిసి పోరాటం చేస్తున్నాయని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. తమ పార్టీ పొత్తుతో వైకాపా నాయకుల్లో అలజడి మొదలైందన్నారు. వైకాపాని భాజాపా పట్టించుకోనందునే... తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో భాజాపా, జనసేన సమావేశం త్వరలో ఏర్పాటు చేసి... భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.
'తమ పొత్తుతో వైకాపాలో అలజడి మెుదలైంది' - Janasena Leaders comments On Ycp
వైకాపా పాలనను అంతమెుందించాలంటే భాజపా, జనసేన కలిసి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు.
!['తమ పొత్తుతో వైకాపాలో అలజడి మెుదలైంది' Janasena Leaders comments On Ycp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5742602-870-5742602-1579259254112.jpg)
జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్
జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్
ఇవీ చదవండి...'అమరావతి రైతులకు మరింత లబ్ధి కలిగేలా సీఎం సూచనలు'