ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ సంస్థగా మార్చేస్తారా?: జనసేన - jansena comments on govt

తిరుమల వెబ్​సైట్​ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రభుత్వాన్ని జనసేన నేతలు నిలదీశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేవస్థానం ఆస్తులు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆరోపించారు.

jansena comments on govt
తిరుమల వెబ్​సైట్ పేరు మార్పుపై ప్రశ్నించిన జనసేన

By

Published : May 23, 2020, 7:03 PM IST

ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వ సంస్థగా మార్చే దిశగా... అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్​ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ttdsevaonline.com గా ఉన్న వెబ్​సైట్​ను, tirupatibalaji.ap.gov.in గా మార్చడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

తితిదే ఆస్తులు, భూములు వేలంపాటల్లో అమ్మడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూలను రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు తరలించి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత తగ్గించే యోచనలో అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారని అభ్యంతరం చెప్పారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రతి జిల్లాలో లడ్డూల అమ్మకం సరికాదని చెప్పారు. ఏదైనా జరిగితే అధికారులదే బాధ్యత అన్నారు.

ABOUT THE AUTHOR

...view details