'సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొత్త షెడ్యూల్ను ప్రకటించాలి' - janasena pac leader pasupulati hariprasad press meet
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో వైకాపా నాయకుల అరాచకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించాలని జనసేన నాయకులు కోరారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియల్లో వైకాపా నాయకుల దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి కొత్త షెడ్యూల్ను విడుదల చేయాలని జనసేన పీఏసీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ కోరారు. అధికారులు, పోలీసులు వైకాపా దుస్తులు వేసుకుని ఎన్నికలను నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చుట్టూ 10-15 మంది వైకాపా నాయకులు నిలబడి నామినేషన్లను ప్రభావితం చేశారని జనసేన నాయకులు ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించాలన్నారు. అవసరమైతే ఆన్లైన్లో నామినేషన్ల అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.