నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే రూ. పది వేలు ఆర్థిక సహాయం అందించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. అధికారంలో ఉన్న నాయకులు ఆకాశంలో తిరుగుతుంటే.. ఆశయం ఉన్న జనసేనాని భూమి మీద రైతులకు మద్దతుగా నిలుస్తున్నారని పార్టీ రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.
రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని జనసేన దీక్ష - రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని జనసేన దీక్ష
నివర్ తుపాను ప్రభావంతో.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు తిరుపతిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు.
రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని జనసేన దీక్ష