చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లెలో విద్యుదాఘాతంతో మృతి చెందిన ముగ్గురు జనసేన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్ధిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలను జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్. శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మృతుల కుటుంబానికి రూ. 13.50 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్షా 25 వేల చొప్పున అందించారు. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
జనసేన కార్యకర్తల మృతుల కుటుంబాలకు పార్టీ ఆర్థిక సహాయం - chitthore district news updates
చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. కార్యకర్తలకు పార్టీ అన్నివేళలా అందుబాటులో ఉంటుందని రాష్ట్ర నాయకులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత