చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల ప్రతిష్ఠాపన వ్యవహారంలో ఈవోను తప్పించి విచారణ జరిపించాలని భాజాపా, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు... ఎస్పీ రమేశ్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఫిర్యాదు లేఖను అందజేశారు. ఆలయ అధికారులకు తెలియకుండా విగ్రహాలు లోనికి వెళ్లటం సాధ్యం కాదన్న భాజపా, జనసేన నాయకులు.. జరిగిన వ్యవహారం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని వ్యాఖ్యనించారు.
బుధవారం ఇరుపార్టీల బృందం ఆలయాన్ని సందర్శించి జరిగిన వ్యవహారంపై నివేదికను తయారు చేస్తామన్నారు. ఇన్నాళ్లు ఆలయాలపై దాడులు జరిగితే...ఇప్పుడు ఆలయాల్లో అపచారాలు జరుగుతున్నాయని దీనిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా పరిగణిస్తున్నామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.