చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లికి చెందిన జనసేన కార్యకర్తలు... పవన్‌కల్యాణ్ జన్మదిన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. వారి కుటుంబాలను తెదేపా అధినేత చంద్రబాబు చరవాణి ద్వారా పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
జనసేన కార్యకర్తలు మృతి.. సంతాపం తెలిపిన చంద్రబాబు - Janasena activists killed latest news
విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన జనసేన కార్యకర్తలకు మెగా కుటుంబం సంతాపం తెలిపింది. తెదేపా అధినేత చంద్రబాబు చరవాణి ద్వారా వారి కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
![జనసేన కార్యకర్తలు మృతి.. సంతాపం తెలిపిన చంద్రబాబు Janasena activists dead.. Chandrababu consulted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8652328-48-8652328-1599045514729.jpg)
జనసేన కార్యకర్తలు మృతి.. పరామర్శించిన చంద్రబాబు
మెగా కుటుంబం హీరోలు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. అల్లు అర్జున్ రూ.2 లక్షలు, రామ్‌చరణ్ రూ.2.50 లక్షల వంతున బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించారు. చనిపోయిన రాజేంద్ర, సోమశేఖర, అరుణాచలం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండీ... ఏపీలో 54.96 శాతం పెరిగిన రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు