జనసేన అధినేత పవన్ కల్యాణ్ భాజపా అభ్యర్ధి రత్నప్రభ తరపున తిరుపతిలో నేడు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి రానున్న పవన్.. రోడ్డు మార్గం ద్వారా తిరుపతిలోని ఎమ్మార్‌పల్లి రోడ్ కూడలికి చేరుకుంటారు.
పాదయాత్రగా..
అనంతరం కోమల్ రెడ్డి కూడలి, అన్నమయ్య కూడలి మీదుగా ఎయిర్ బైపాస్ రహదారిలో శంకరంబాడి విగ్రహం వరకు పాదయాత్రగా తరలివెళ్తారు. శంకరం బాడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రచార పర్వంలో జనసేన అధినేతతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, అభ్యర్ధి రత్నప్రభ, ఇతర భాజపా నేతలు పాల్గొంటారు.
ఇవీ చూడండి:
తిరుపతి చేరుకున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్